
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు జరిగిన కుట్రలో రాష్ట్ర బిజెపి నేతలు జితేందర్ రెడ్డి, డికె.అరుణల హస్తం ఉందని అనుమానిస్తున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పడంతో బుదవారం రాత్రి వారిరువూరు ఇళ్ళపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. మళ్ళీ గురువారం ఉదయం 11 గంటలకు సుమారు 20 మంది మహబూబ్‌నగర్‌లోని జితేందర్ రెడ్డి ఇంటిపై రాళ్ళతో దాడి చేసారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా వారిని తప్పించుకొని దూసుకువెళ్ళి రాళ్ళతో దాడులు చేసి పారిపోయారు.
టిఆర్ఎస్-బిజెపిల మద్య మళ్ళీ మరో కొత్త యుద్ధం మొదలైంది. జితేందర్ రెడ్డి ఇంటి కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడిలో జితేందర్ రెడ్డి అనుచరుడు సురేందర్ రెడ్డి గాయపడ్డారు. ఈవిషయం తెలుసుకొన్న బిజెపి కార్యకర్తలు అక్కడకు రావడంతో దుండగులు పారిపోయారు. జితేందర్ రెడ్డి ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన సిసి కెమెరాలలో ఈ దాడులు రికార్డ్ అయ్యాయి. డికె.అరుణ గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుకి ఫోన్ చేసి ఈ దాడుల గురించి ఫిర్యాదు చేసి సిసి కెమెరా రికార్డింగ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని కోరారు.