యూపీలో కొనసాగుతున్న 6వ దశ పోలింగ్

ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భాగంగా నేడు 6వ దశ పోలింగ్ జరుగుతోంది. పది జిల్లాలో గల 57 స్థానాలకు మొత్తం 676 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. నేడు పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాలలో యూపీ సిఎం యోగీ ఆధిత్యనాథ్ పోటీ చేస్తున్న ఘోరక్‌పూర్ కూడా ఒకటి. కొద్ది సేపటి క్రితం ఆయన అక్కడ తన ఓటు హక్కు వినియోగించుకొన్నారు. యూపీ శాసనసభలో 403 స్థానాలకు ఇప్పటివరకు 292 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. నేడు మరో 57 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మిగిలిన 54 స్థానాలకు ఈనెల 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 10వ తేదీన వెలువడతాయి.