తెలంగాణ తలసరి ఆదాయంలో 19.10 శాతం వృద్ధి

తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపిలు రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై నిత్యం అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటే కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ(ఎంఓఎస్‌పీఐ) రాష్ట్రాభివృద్ధికి అద్దంపట్టే లెక్కలను నిన్న విడుదల చేసింది. దాని ప్రకారం 2021-22 సంవత్సరాలకి గాను రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీడీపీఎస్), తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది. 

తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారిగా జీడీపీఎస్‌లో 19.46 శాతం వృద్ధి సాధించగా, తలసరి ఆదాయంలో 19.10 శాతం వృద్ధి సాధించింది. ఇది దేశంలోనే అత్యధికమని ఎంఓఎస్‌పీఐ నివేదికలో పేర్కొంది. దాని ప్రకారం రాష్ట్రంలో జీడీపీఎస్‌ను ప్రస్తుత ధరల ప్రకారం రూ.1,154,860 కోట్లు కాగా తలసరి ఆదాయం రూ.2,78,833 ఉన్నట్లు పేర్కొంది.

తెలంగాణ ఏర్పడిన తరువాత జీడీపీఎస్‌లో అత్యంత తక్కువగా గత ఏడాది కేవలం 2.25 శాతం వృద్ధిరేటు మాత్రమే సాధించింది. కానీ ఈ ఏడాది (2021-22)లో ఏకంగా 19.46 శాతం వృద్ధి రేటు సాధించింది. అదేవిదంగా 2020-21లో తెలంగాణలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 1.64 శాతం మాత్రమే ఉండగా ఈ ఏడాది అది 18.78 శాతానికి చేరింది.  

తెలంగాణ ఏర్పడి 8 ఏళ్ళు పూర్తికాక మునుపే దేశంలో మిగిలిన రాష్ట్రాలను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తోంది. కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఈ గణాంకాలే తెలంగాణలో జరుగుతున్న ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలకు జవాబు చెపుతున్నాయి.       

తలసరి ఆదాయం (రూపాయల్లో): 

2014-15లో రూ.1,24,104, (వృద్ధి రేటు 10.65 శాతం) 

2015-16లో రూ.1,40,840, (వృద్ధి రేటు 13.49 శాతం)

2016-17లో రూ.1,59,395, (వృద్ధి రేటు 13.17 శాతం)

2017-18లో రూ.1,79,358, (వృద్ధి రేటు 12.52 శాతం)

2018-19లో రూ.2,09,848, (వృద్ధి రేటు17.00 శాతం)

2019-20లో రూ. 2,30,955 (వృద్ధి రేటు10.06 శాతం)

2020-21లో రూ.2,34, 751 (వృద్ధి రేటు 1.64 శాతం)

2021-22లో రూ.2,78,833, (వృద్ధి రేటు 18.78 శాతం)

జీడీపీఎస్‌లో వృద్ధి రేటు: (కోట్లలో)

2014-15లో రూ.5,05,849, (వృద్ధి రేటు 12.02 శాతం) 

2015-16లో రూ.5,77,902, (వృద్ధి రేటు 14.24 శాతం)

2016-17లో రూ.6,58,325, (వృద్ధి రేటు 13.92 శాతం)

2017-18లో రూ.7,50,050, (వృద్ధి రేటు 13.93 శాతం)

2018-19లో రూ.8,57,427, (వృద్ధి రేటు 14.32 శాతం)

2019-20లో రూ.9,48,356, (వృద్ధి రేటు10.60 శాతం)

2020-21లో రూ.9,69,656 (వృద్ధి రేటు 2.25 శాతం)

2021-22లో రూ.11,54,860, (వృద్ధి రేటు 19.10 శాతం).