సంబంధిత వార్తలు
మణిపూర్ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మణిపూర్ శాసనసభలో మొత్తం 60 స్థానాలుండగా వాటిలో 38 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. వీటి కోసం 15 మంది మహిళలతో సహా మొత్తం 173 మంది పోటీ పడుతున్నారు. మార్చి 5న మిగిలిన 22 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మణిపూర్‌తో సహ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడతాయి.