
ఉక్రెయిన్పై భీకరదాడులు చేస్తున్న రష్యాను ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో రాక్షసరాజ్యం స్థాపించి నిరంకుశపాలన సాగిస్తున్న తాలిబన్ ప్రభుత్వం కూడా రష్యాకు శాంతి ప్రవచనాలు చెప్పడమే విశేషం. ఉక్రెయిన్పై రష్యా దాడులపై తాలిబన్ ప్రభుత్వం స్పందిస్తూ, “ఉక్రెయిన్ తాజా పరిణామాలను మేము నిశితంగా గమనిస్తున్నాము. అక్కడ జరుగుతున్న యుద్ధంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతుండటం చాలా బాధాకరం. కనుక ఇరు పక్షాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఉక్రెయిన్లో మరింత విధ్వంసం జరుగకుండా భాగస్వామ్య పక్షాలన్నీ సంయమనం పాటించాలని కోరుతున్నాం. మా ప్రభుత్వ విదేశీ విధానం మేరకు...ఇరు పక్షాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొని శాంతి నెలకొల్పాలని పిలుపునిస్తున్నాం. ఉక్రెయిన్లో చదువుకొంటున్న మా ఆఫ్ఘన్ విద్యార్దులు భద్రత పట్ల రష్యా, ఉక్రెయిన్ దేశాలు శ్రద్ద వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం,” అని తాలిబన్ ప్రభుత్వం ట్విట్టర్లో ఓ సందేశం పోస్ట్ చేసింది.