19వ బయో ఆసియా సదస్సు ప్రారంభం

నేటి నుంచి రెండు రోజులు వర్చువల్‌గా సాగే 19వ బయో ఆసియా సదస్సును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కరోనా కారణంగా లైఫ్ సైన్సస్ (జీవ శాస్త్ర) రంగానికి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. జీవ శాస్త్ర రంగంలో తెలంగాణ రాష్ట్రం 215 సంస్థల నుంచి రూ.6,400 కోట్లు పెట్టుబడులు ఆకర్షించగలిగింది. వాటి ద్వారా 34 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. జీవ శాస్త్ర రంగం అభివృద్ధికి జీనోమ్ వ్యాలీ గట్టి పునాది వేసింది. ఒక్క ఏడాది వ్యవధిలోనే ఈ రంగంలో 200 శాతం అభివృద్ధి జరిగిందంటే ఈ రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఈ బయోసదస్సు కూడా జీవ శాస్త్ర రంగం అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది, “ అని అన్నారు.