దేశాన్ని బాగుచేసుకోవాలె...నే బయలుదేరుతున్నా: కేసీఆర్‌

ఈరోజు నారాయణఖేడ్‌లో జరిగిన బహిరంగ సభలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడక మునుపు అనేక సందేహాలు ఉండేవి. మనకు పరిపాలన చేతకాదని, రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుందంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. అలా మాట్లాడినవారి రాష్ట్రంలోనే ఇప్పుడు 24 గంటలు విద్యుత్ ఉండటం లేదు. కానీ దేశం మొత్తం మీద ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 24 గంటలు విద్యుత్ సరఫరా జరుగుతోంది. త్రాగునీరు, సాగునీటి సమస్యలు శాస్వితంగా పరిష్కరించుకొన్నాము. ఈ ఏడేళ్ళలో రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకొన్నాము. మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏవిదంగా బాగుచేసుకొని అభివృద్ధి చేసుకొన్నామో అదేవిదంగా మన దేశాన్ని కూడా బాగుచేసుకొని అభివృద్ధి చేసుకోవాలి. అమెరికా కంటే గొప్ప దేశంగా భారత్‌ను నిలపాలి. మన విద్యార్ధులు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కాదు... విదేశీ విద్యార్దులే ఉన్నత చదువుల కోసం మన దేశం రావాలి. భారత్‌ను అన్నివిదాలా అభివృద్ధి చేసేందుకు నేను జాతీయ రాజకీయాలలోకి వెళుతున్నాను. బంగారి తెలంగాణ ఎలా సాధించుకొన్నామో అలాగే బంగారి భారత్‌ను కూడా సాధించుకోవాలి మనం,” అని అన్నారు.