భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా

నేడు జరగాల్సిన  భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఏపీ ఐ‌టి, పరిశ్రమల మంత్రి మేకపల్లి గౌతమ్ రెడ్డి ఈరోజు ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించినందున ఈ విషాదసమయంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం భావ్యం కాదని వాయిదా వేసినట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈ వేడుక మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే చిత్ర యూనిట్ తెలియజేస్తుందని తెలిపారు.  

పవన్‌ కల్యాణ్‌, నిత్యా మీనన్,  రానా, సంయుక్తా మీనన్ జంటలుగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈనెల 25న విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినందున దానిని వాయిదా వేయకపోవచ్చు. 

సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ అందివ్వగా తమన్ సంగీతం సమకూర్చారు.