సెలవుపై డిజిపి మహేందర్ రెడ్డి

తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి శుక్రవారం నుంచి 15 రోజులపాటు సెలవు తీసుకొన్నారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4వరకు ఆరోగ్య కారణాలతో (సిక్ లీవ్) సెలవు తీసుకొన్నట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆయన తిరిగి వచ్చే వరకు ఏసీబీ డీజీగా పనిచేస్తున్న అంజనీ కుమార్‌ డిజిపిగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.