
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బుదవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి జిల్లాలోని వర్ని మండలంలోని సిద్దాపూర్ చేరుకొంటారు. ముందుగా సిద్ధాపూర్ జలాశయం నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేస్తారు. తరువాత సిద్దాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 11 గంటలకు సిద్దాపూర్లో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తరువాత మధ్యాహ్నం ఒంటిగంటకు ముగ్గురూ కలిసి హైదరాబాద్కు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం అవుతారు.