మా పిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?

రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఇవాళ్ళ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. అనంతరం వారిరువురూ మీడియాతో మాట్లాడారు. “అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడాటాన్ని సిఎం కేసీఆర్‌ తీవ్రంగా ఖండించారు. బాగానే ఉంది. అయితే మేము రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో అస్సాం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పిర్యాదులు చేస్తే ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయలేదు. ఎంపీలమైన మేము పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేసినా పట్టించుకోరా? అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోగలరో లేదో వేరే విషయం. కనీసం కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాలి కదా?రాహుల్ గాంధీకి అవమానం జరిగిందని మీరు నిజంగా భావిస్తున్నట్లయితే, మా పిర్యాదుల ఆధారంగా అస్సాం సిఎంపై కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాలి కదా? కానీ చేయలేదంటే ఈ విషయంలో కూడా మీకు చిత్తశుద్ధి లేదనే కదా అర్ధం?ఈవిదంగా ప్రతీ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించడం సరికాదు. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే అస్సాం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.