కేసీఆర్‌ విమర్శకు అస్సాం సిఎం జవాబు

సర్జికల్ స్ట్రైక్స్ అంశంపై బిజెపి, కాంగ్రెస్‌ల మద్య మొదలైన వివాదంలో సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్లు ఆధారాలు చూపమని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ అడగడంలో తప్పేముంది?నేను కూడా అడుగుతున్నాను ఆధారాలు చూపండి,” అని కేంద్రాన్ని నిలదీశారు. 

దీనిపై రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించి ఈ వివాదానికి బీజం వేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేసీఆర్‌ ప్రశ్నకు ధీటుగా స్పందిస్తూ, డియర్ కేసీఆర్‌ గారు ఇవిగో సర్జికల్ స్ట్రైక్స్ సంబందించిన వీడియోలు. మీ ప్రశ్న మన ఆర్మీని అవమానించేదిగా ఉంది. మీరు ఈవిదంగా మాట్లాడుతూ మన ఆర్మీని ఎందుకు అవమానపరుస్తున్నారు?  అని ప్రశ్నించారు.