1.jpg)
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రాజ్యసభలో బడ్జెట్‌పై
జరిగిన చర్చలో కాంగ్రెస్ విమర్శలకు బదులిస్తూ, “పేదరికం అంటే అదో మనోభావన
మాత్రమే...తిండి, డబ్బు, బట్ట, గూడు లేకపోవడం కాదని గతంలో మీ నాయకుడు అన్నారు. దేశంలో పేదరికాన్ని, పేదల కష్టాలను గుర్తించకుండా ఆవిదంగా మాట్లాడి మీ నాయకుడు పేదప్రజలను అవమానించారు.
కానీ మేము పేదల అభ్యున్నతికి తోడ్పడే బడ్జెట్‌ను ప్రతిపాదిస్తే మీరు వ్యతిరేకిస్తున్నారు.
మీరందరూ (కాంగ్రెస్ ఎంపీలు) మీ నాయకుడిని కాపాడుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే
వానాకాలంలో కప్పలు బెకబెకలాడుతూ తమ ఉనికిని తెలియజేసినట్లే ఉంది.
యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కాపీని మీ నాయకుడు మీడియా
సమక్షంలో చించివేసినప్పుడే కాంగ్రెస్ పార్టీకి రాహుకాలం మొదలైంది. మీ పార్టీలో 23 సీనియర్
నేతలు మీ నాయకుడి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న సమయం రాహుకాలం. కాంగ్రెస్ పార్టీ బలం
44 ఎంపీ సీట్లకు పడిపోవడం మీ పార్టీకి రాహుకాలం..” అంటూ నిర్మలా సీతారామన్ కాంగ్రెస్
ఎంపీలకు, వారి నాయకుడు రాహుల్ గాంధీకి చురకలు అంటించారు.