ఇక జిల్లాలలో భూముల వేలానికి రంగం సిద్దం

హైదరాబాద్‌లో కోకాపేట వంటి అంత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలలో భూములు వేలంవేసి భారీగా ఆదాయం సమకూర్చుకొన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాలలో భూములు వేలం వేసేందుకు సిద్దమవుతోంది. టీఎస్‌ఐఐసీ మరియు హెచ్‌ఎండీఏ కలిసి ప్రత్యక్ష పద్దతిలోనే ఈ వేలంపాటను నిర్వహించబోతున్నాయి. రంగారెడ్డి, కామారెడ్డి, నల్లగొండ, వికారాబాద్, మహబూబ్‌నగర్‌, గద్వాల్, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలలో గల 1,408 స్థలాలను మార్చి 14 నుంచి 17వరకు ఆయా జిల్లా కేంద్రాలలో వేలం వేయనున్నాయి. వీటికి సంబందించి పూర్తి వివరాలు టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, ఆయా జిల్లాల వెబ్‌సైట్‌లలో ఉంచుతామని సంబందిత అధికారులు తెలిపారు. అలాగే బ్రోచర్లను కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 

ఈ భూముల వేలంపాటలో తొలిసారి పాల్గొనేవారు, సంస్థలు రూ.10,000 ధరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 18న మళ్ళీ మార్చి 17వ తేదీన వీటికి ప్రీ-బిడ్డింగ్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.  ఈ భూముల కొనుగోలు చేయాలనుకొనేవారు నేటి నుంచి మార్చి 10వ తేదీ వరకు వాటిని సందర్శించవచ్చని తెలిపారు. 

జిల్లా, ప్రాంతం

ఎన్ని ప్లాట్లు

కనీస ధర (చదరపు గజానికి)

రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి

3

రూ. 40,000

రంగా రెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్

313

రూ.10,000

నల్లగొండ జిల్లా, నార్కాట్ పల్లి

240

రూ.10,000

కామారెడ్డి జిల్లాలో, కామారెడ్డి పట్టణం

230

రూ. 10,000

వికారాబాద్ జిల్లాలో యాలాల్

17

రూ. 10,000

మహబూబ్‌నగర్‌ జిల్లాలో భూత్పూర్

240

రూ. 8,000

గద్వాల జిల్లాలో గద్వాల్ పట్టణం

202

రూ. 8,000

ఆదిలాబాద్‌ జిల్లాలో మావల

3

రూ. 8,000

పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం

89

రూ. 5,000

ఆసిఫాబాద్‌ జిల్లాలో కాగజ్ నగర్

71

రూ. 5,000