సంబంధిత వార్తలు

కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదంపై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో స్పందిస్తూ, “నేను నుదుటన సింధూరం పెట్టుకొంటున్నట్లే ముస్కాన్ హిజాబ్ ధరిస్తోంది. మహిళలకు ఏది సౌకర్యమో..ఏమి ధరించాలో వాళ్ళనే నిర్ణయించుకోనీయండి,” అని అన్నారు. దాంతో పాటు కులమతాలు, భాషలు, కట్టుబొట్టూ అన్నీ వేరైనా మేమంతా భారతీయులమే అనే ఓ హిందీ కవితను ట్యాగ్ చేశారు.