నేడు రాష్ట్రవ్యాప్తంగా చావు డప్పు...హవ్వ!

ధాన్యం కొనుగోలుపై కేంద్రప్రభుత్వం, రాష్ట్ర బిజెపి నేతల వైఖరిని నిరసిస్తూ టిఆర్ఎస్‌ అధ్వర్యంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతోంది. దీనిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొదలు గ్రామస్థాయి వరకు ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొంటారు. 

యాసంగిలో పండే ధాన్యం కొనుగోలు చేయకూడదనే కేంద్రప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలో రైతులపాలిట చావు కబురు వంటిదని సూచించేందుకుగాను ఈరోజు నిర్వహించబోయే నిరసన కార్యక్రమాలలో ఊరూరా చావుడప్పులు మోగించాలని టిఆర్ఎస్‌ నిర్ణయించింది! 

కేంద్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనందుకు ప్రజాస్వామ్యబద్దంగా నిరసనలు తెలపడాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ తెలంగాణలో ఊరూరా చావు డప్పు కొట్టడాన్ని ఎవరూ హర్షించలేరు. రాష్ట్రంలో ఎప్పుడూ మంగళకరమైన వాతావరణం ఉండాలని ఎవరైనా కోరుకొంటారు. కానీ అధికార టిఆర్ఎస్‌ పార్టీయే ఇలా ఊరూరా చావు డప్పులు కొడుతూ ప్రజలలో ఆందోళన కలిగించడం ఏమి సబబు?