పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేవెళ్ళలో పాదయాత్ర

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి శనివారం చేవెళ్ళలో పాదయాత్ర చేయబోతున్నారు. కేంద్రప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనకు నిరసనగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ యూపీలోని అమేధీలో పాదయాత్ర చేయబోతున్నారు. వారి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ రేవంత్‌ రెడ్డి అధ్యవర్యంలో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు రేపు చేవెళ్ళలో పాదయాత్ర చేపట్టబోతున్నారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్ గౌడ్ విలేఖరులకు తెలియజేశారు.  

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ఘోర పరాజయంతో పార్టీలో రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్లు మళ్ళీ ఆయనపై విమర్శలు గుప్పించారు. కానీ రేవంత్‌ రెడ్డి..వర్గీయులు మౌనం వహించారు. ఇప్పుడు ఆ వేడి తగ్గింది కనుక మళ్ళీ చేవెళ్ళలో పాదయాత్రతో పార్టీని యాక్టివ్ మోడ్‌లోకి తీసుకువచ్చేందుకు రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లున్నారు.