ఐదు షోలతో తెలంగాణలో పుష్ప వికాసం

అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం పుష్ప సినిమాకు ఊహించని బహుమతులు ఇచ్చింది. అల్లు అర్జున్‌ అభిమానుల ఆరాటాన్ని, ఆ సినిమా పెట్టుబడిని దృష్టిలో ఉంచుకొని రేపటి నుంచి డిసెంబర్‌లో 30వరకు రోజుకు 5 షోలు వేసుకొనేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈనెల 30వరకు టికెట్లపై రూ.50 చొప్పున పెంచుకొనేందుకు థియేటర్ యజమానులకు, డిస్ట్రిబ్యూటర్లను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పుష్ప సినీ దర్శకనిర్మాతలతో పాటు దాంతో ముడిపడున్న అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌ అభిమానులు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.