సిఎం కేసీఆర్‌ ఈ నెల 19న వనపర్తి పర్యటన

సిఎం కేసీఆర్‌ ఈ నెల 19న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన  టిఆర్ఎస్‌ పార్టీ కార్యలయం, చిట్యాల సమీపంలోని వ్యవసాయ మార్కెట్‌ ప్రారంభోత్సవాల కొరకు సిఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తున్నారు. వనపర్తిలో వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, రోడ్ల విస్తరణ పనులు, గంజిలో ఇంటిగ్రేటడ్ మార్కెట్‌ నిర్మాణ పనులకు సిఎం కేసీఆర్‌ శంఖుస్థాపన చేస్తారు. 

సిఎం కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి మంత్రి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ షేక్ యాస్మిన్ భాషా, అధికారులతో చర్చించారు. తరువాత చిట్యాల శివారులో నిర్మిస్తున్న  డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను పరిశీలించారు.