.jpg)
కేంద్రప్రభుత్వం సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు గనులను వేలం వేయాలని నిర్ణయించడంతో దానిని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు నేటి నుంచి మూడు రోజుల పాటు సమ్మె మొదలుపెట్టాయి. ఈరోజు ఉదయం షిఫ్టుకు హాజరవ్వాల్సిన కార్మికులు విధులను బహిష్కరించడంతో సింగరేణిలో సమ్మె మొదలైంది. గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్ ఇచ్చిన సమ్మె పిలుపుకు సింగరేణిలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంసీ, సీఐటీయూ, బీఎంఎస్ యూనియాన్లకు చెందిన కార్మికులందరూ మద్దతు పలుకుతూ సమ్మెలో పాల్గొంటున్నారు. సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 20 వేలమంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటుండటంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సమ్మె వలన సింగరేణిలో రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచియింది. దీంతో సింగరేణికి రోజుకు రూ.60 కోట్లు నష్టం కలుగుతోంది. ఆ లెక్కన మూడు రోజులకు రూ.180 కోట్లు నష్టం కలుగుతుంది. ఈ నేపధ్యంలో సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ వ్రాసి సింగరేణి బొగ్గు గనుల వేలం ఆలోచనను విరమించుకోవాలని కోరారు.