త్వరలో అమిత్ షాను కలవనున్న తీన్‌మార్ మల్లన్న

క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అధినేత చింతపండు నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్న త్వరలో బిజెపిలో చేరబోతున్నారు. 

మల్లన్న టీం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రజనీకాంత్, కమిటీ సభ్యులు ఆదివారం సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ, “తీన్‌మార్ మల్లన్న రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతుండగా ప్రభుత్వం ఆయనపై 38 అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసి 78 రోజులో జైల్లో పెట్టించింది. జైల్లో ఉన్నప్పుడు తీన్‌మార్ మల్లన్న ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి కలిగింది. ఆ సమయంలో రాష్ట్ర బిజెపి మల్లన్నకు అండగా నిలిచింది. ప్రజల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలంటే తీన్‌మార్ మల్లన్నకు బిజెపి వంటి బలమైన పార్టీ అండదండలు చాలా అవసరం అందుకే బిజెపిలో చేరాలని నిశ్చయించుకొన్నారు. ఒకటి రెండు రోజులలో తీన్‌మార్ మల్లన్న ఢిల్లీ వెళ్ళి కేంద్రహోంత్రి అమిత్ షాను కలిసి వస్తారు. ఆ తరువాత వారి నిర్దేశం ప్రకారం బిజెపిలో చేరుతారు,” అని చెప్పారు.