
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారత్‌కు రానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఆ దేశ రక్షణ, విదేశాంగ మంత్రులు సెర్గీ షోయిగు, సెర్గీ లవ్రోవ్‌లతో కలిసి మాస్కో నుంచి నేరుగా ఢిల్లీ చేరుకొంటారు. ఈ ఒక్కరోజు పర్యటనలో వారు ప్రధాని నరేంద్రమోడీ, భారత్ రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఎస్. జైశంకర్‌లతో సమావేశమవుతారు. దీనిలో భారత్-రష్యా ద్వీపాక్షిక సంబంధాలు, రష్యా నుంచి సుమారు ఎడున్నర లక్షల ఏకే-203 రైఫిల్స్, అత్యాధునిక ఎస్-400 క్షిపణులు కొనుగోలు, ఆఫ్ఘనిస్తాన్ సమస్య తదితర అంశాలపై చర్చించనున్నారు. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయబోయే ఈ ఆయుధాల విలువ సుమారు $5.43 బిలియన్స్ ఉంటుంది. రష్యా సహకారంతో ఏకే-203 రైఫిల్స్‌ను భారత్‌లోనే తయారుచేసేందుకు కేంద్రప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ కర్మాగారం ఏర్పాటుచేసి తయారుచేయబోతోంది.