నేటి నుంచి నాగార్జునసాగర్-శ్రీశైలం లాంచీ సేవలు షురూ

నేటి నుంచి నాగార్జునసాగర్-శ్రీశైలం లాంచీ సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ప్రకటించింది. సోమవారం ఉదయం 9 గంటలకు తొలి లాంచీ ప్రయాణికులతో నాగార్జునసాగర్‌ నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం చేరుకొన్నాక, అక్కడే రాత్రి నిలిచిపోతుంది. మళ్ళీ మర్నాడు ఉదయం 9 గంటలకు ప్రయాణికులతో బయలుదేరి సాయంత్రం 3 గంటలకు నాగార్జునసాగర్‌ చేరుకొంటుంది. సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. నిన్న (ఆదివారం) ఒక్కరోజే 60 మంది టికెట్స్ బుక్ చేసుకొన్నారని వారితో ఈరోజు ఉదయం తొలి లాంచీలో శ్రీశైలం బయలుదేరి వెళుతుందని తెలిపారు. 

సాగర్-శ్రీశైలం లేదా శ్రీశైలం-సాగర్ లాంచీ ప్రయాణం ప్యాకేజీల వివరాలు: 

ఒకవైపు ప్రయాణానికి : పెద్దలకు రూ.1,500, పిల్లలకు రూ.1,200.      

రానూపోనూ ప్రయాణానికి: పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000.  

హైదరాబాద్‌ నుంచి సాగర్ వరకు బస్సులో, సాగర్-శ్రీశైలం-సాగర్ లాంచీ ప్రయాణం, మళ్ళీ బస్సులో హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు ప్యాకేజీ: పెద్దలకు రూ.3,900, పిల్లలకు రూ.3,399.