సింగరేణిలో సమ్మె సైరన్

సింగరేణిలో మళ్ళీ చాలా కాలం తరువాత సమ్మె సైరన్ మ్రోగింది. కేంద్రప్రభుత్వం సింగరేణితో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రంలో బొగ్గు గనులను వేలం వేస్తోంది. వాటిలో సింగరేణికి చెందిన కోయగూడెంలోని బ్లాక్-3, సత్తుపల్లిలోని బ్లాక్-3, శ్రావణ్ పల్లి బ్లాక్, కెకె-6 బ్లాకులను వేలంపాట జాబితాలో చేర్చింది. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబర్‌ 9వ తేదీ లేదా మరుసటి రోజు నుంచి సమ్మె చేయబోతున్నట్లు సింగరేణి గుర్తింపు బొగ్గు సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిఆర్ఎస్‌ అనుబంద సంస్థ) నేతలు గురువారం సింగరేణి ఛైర్మన్, ఆర్‌ఎల్‌సీలకు ఈమెయిల్ ద్వారా నోటీసు పంపారు. కేంద్రప్రభుత్వం తక్షణం తన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని లేకుంటే డిసెంబర్‌ 9 నుంచి ఎప్పుడైనా సమ్మె మొదలుపెడతామని యూనియన్ నేతలు హెచ్చరించారు.