ఆరుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నిక

ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 16న నామినేషన్లు వేసిన ఆరుగురు టిఆర్ఎస్‌ అభ్యర్ధులకు వేరే పార్టీల నుంచి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి సోమవారం సాయంత్రం ప్రకటించారు. వెంటనే వారికి దృవీకరణ పత్రాలు కూడా అందజేశారు.

కొత్తగా ఎన్నికైన అభ్యర్ధులు వీరే: కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్, బండా ప్రకాష్, వెంకట్రామి రెడ్డి. 

వీరిలో బండా ప్రకాష్ రాజ్యసభ సభ్యులుకాగా, వెంకట్రామి రెడ్డి సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.