వెంకట్ రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్‌

సిద్ధిపేట కలెక్టర్‌ వెంకట్ రామిరెడ్డి టిఆర్ఎస్‌ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తన పదవికి రాజీనామా చేయడం, దానిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించడం అందరికీ తెలిసిందే. కానీ ఐఏఎస్ అధికారులు  కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారు కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన రాజీనామాను ఆమోదించే అధికారం ఉండవని, కనుక ఆయన రాజీనామాను ఆమోదించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శంకర్, సుబేదార్ సింగ్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఈరోజు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసులో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను, శాసనమండలి కార్యదర్శిని, ఈసీని ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీనిపై అత్యవసర విచారణ చేయవలసిందిగా పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు కానీ కోర్టు వారి పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది కానీ వారి అభ్యర్ధనను తిరస్కరించింది.