హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

సిక్కు మత గురువు గురు నానక్ జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్‌లో సిక్కులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కనుక ఆయా ప్రాంతాలలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించి వాహనాలను ఇతర మార్గాలలోకి మళ్లిస్తున్నారు. 

నగరంలో సుల్తాన్ బజార్, ఛార్మినార్, గోషామహల్ పరిధిలోని శివాజీ బ్రిడ్జ్ జంక్షన్, అఫ్జల్ గంజ్ జంక్షన్, నయాపూల్, శాంతి ఫైర్ వర్క్స్ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 

ఈరోజే ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా హైదరాబాద్‌ నగరానికి రానున్నారు. సాయంత్రం 4.40 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి గ్రీన్‌ ల్యాండ్స్ వద్దగల యోధ డయోగ్నస్టిక్ సెంటరుకు వెళతారు. అక్కడి నుంచి సాయంత్రం 5.50 గంటలకు జూబ్లీ హిల్స్ లోని రోడ్‌ నెంబర్ 29కి వెళతారు. కనుక ఆయన పర్యటన సమయంలో ఆయా మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.