40.jpg)
త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సిఎం కేసీఆర్ ఐదుగురు టిఆర్ఎస్ అభ్యర్ధులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 29న ఎమ్మెల్యేల కోటాలో 6 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. వాటిలో నాలుగు స్థానాలకు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, రవీందర్ రావులను ఖరారు చేసినట్లు తాజా సమాచారం.
డిసెంబర్ 10న స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఈరోజు సిద్ధిపేట కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్ రామిరెడ్డి పేరును వాటిలో ఒకదానికి ఖరారు చేసినట్లు తాజా సమాచారం.
సిఎం కేసీఆర్ నేడు ప్రగతి భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై చర్చించిన తరువాత మొత్తం ఐదుగురి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. అయితే టిఆర్ఎస్ దీనిని అధికారికంగా ప్రకటించవలసి ఉంది. మంగళవారం సిఎం కేసీఆర్ స్వయంగా అభ్యర్ధుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
ఎమ్మెల్యేల కోటా...
నవంబర్ 9: నోటిఫికేషన్ జారీ; నవంబర్ 29: పోలింగ్, కౌంటింగ్, ఫలితాలు ప్రకటన.
స్థానిక సంస్థల కోటా…
ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కోటి, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి రెండు చొప్పున మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
షెడ్యూల్:
నవంబర్ 16: నోటిఫికేషన్; నవంబర్ 16 నుంచి 23వరకు: నామినేషన్లు స్వీకరణ; నవంబర్ 24: నామినేషన్ల పరిశీలన;
నవంబర్ 26వరకు: నామినేషన్ల ఉపసంహరణ; డిసెంబర్ 10: పోలింగ్; డిసెంబర్ 14: ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి.