హరీష్ రావుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా

ఆర్ధిక మంత్రి హరీష్‌రావుకు అదనంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా అప్పగించబడింది. ఈ మేరకు సిఎం కేసీఆర్‌ మంగళవారం సంబందిత ఫైలుపై సంతకం చేశారు. 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌ అసైన్డ్ భూములు కబ్జా చేశారనే ఆరోపణలతో ఈ ఏడాది మే 1వ తేదీన పదవి నుంచి తొలగింపబడ్డారు. అప్పటి నుంచి ఆ శాఖను సిఎం కేసీఆరే చూస్తున్నారు. ఇప్పుడు దానిని మంత్రి హరీష్‌రావుకు అప్పగించారు. 

మంత్రి హరీష్‌రావు హుజూరాబాద్‌లో సుమారు రెండు నెలలు మకాం వేసి ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. టిఆర్ఎస్‌పై ఈటల రాజేందర్‌ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయన ఈరోజు ఎమ్మెల్యేగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎదుట ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సరిగ్గా ఇవ్వాళ్ళే మంత్రి హరీష్‌రావు కూడా ఈటల రాజేందర్‌ నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతుండటం విశేషం.