సంబంధిత వార్తలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. ఏపీలో 11, తెలంగాణలో 12 స్థానాలకు షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక్కోటి, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెందూ చొప్పున మొత్తం 12 స్థానాలకు మంగళవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.
షెడ్యూల్:
నోటిఫికేషన్: నవంబర్ 16న
నామినేషన్లు స్వీకరణ: 16 నుంచి 23వరకు
నామినేషన్ల పరిశీలన: నవంబర్ 24
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: నవంబర్ 26వరకు
పోలింగ్: డిసెంబర్ 10న
ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: డిసెంబర్ 14న.