తీన్‌మార్ మల్లన్నకు బెయిల్‌ మంజూరు

క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌ అధినేత చింతపండు నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్నకు బెయిల్‌ మంజూరైంది. ఆయనపై పోలీసులు మొత్తం 38 కేసులు నమోదు చేయగా హైకోర్టు వాటిలో 6 కేసులను కొట్టివేసి,31 కేసులకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు హైకోర్టు నేడు బెయిల్‌ ఉత్తర్వులు జారీ చేసింది. తీన్‌మార్ మల్లన్న గత 74 రోజులుగా వివిద కేసులలో జైలులో ఉన్నారు. అప్పటి నుంచి ఆయన బెయిల్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వ తీరును, విధానాలను, అవినీతిని తన భర్త నిలదీస్తున్నా కారణంగానే పోలీసులు ఆయనపై తప్పుడు కేసులు బనాయించి వేదిస్తున్నారంటూ ఆయన భార్య కేంద్రహోంమంత్రి అమిత్ షాకు లేఖ వ్రాశారు. తీన్‌మార్ మల్లన్న జైలు నుంచి విడుదలయ్యాక బిజెపిలో చేరుతారని ఆమె తెలిపారు.