బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ ఘన విజయం

ఊహించినట్లే కడప జిల్లా బద్వేల్ శాసనసభ ఉపఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధ ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప బిజెపి అభ్యర్ధి సురేష్ పై 90,533 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ ఉపఎన్నిక ఫలితాన్ని ముందే ఊహించిన టిడిపి పోటీ చేయకుండా పరాభవం పొందకుండా తప్పించుకోగా, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు వైసీపీకి గట్టి పోటీ ఇవ్వలేక చతికిల పడ్డాయిరు. 

బద్వేల్ ఉపఎన్నికలో వైసీపీకి 1,12,211 ఓట్లు, బిజెపికి 21,678 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 6,235 ఓట్లు పోల్ అయ్యాయి. డాక్టర్ దాసరి సుధ ఘన విజయం సాధించడంతో ఎన్నికల అధికారులు ఆమెకు ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు దృవీకరణ పత్రం అందజేశారు.