హుజూరాబాద్ ఉపఎన్నికల ఫలితాలపై రేపు మధ్యాహ్నం ఒంటి గంట రెండు లోపుగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈసారి హుజూరాబాద్ ఉపఎన్నికలో గతంలో 84.45 శాతం నమోదు కాగా ఈసారి మరో రెండు శాతం ఎక్కువగా అంటే 86.33 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఉపఎన్నికలో ప్రధానంగా టిఆర్ఎస్, బిజెపిల మద్యే పోటీ జరిగింది. రెండు పార్టీలు కూడా తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ పూర్తయినందున వివిద మీడియా సంస్థలు ఓటర్ల నాడీ తెలుసుకొనేందుకు సర్వేలు చేపట్టి ఏ పార్టీకి విజయావకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాయి. ఐదు సంస్థలు సర్వే చేయగా వాటిలో నాలుగు బిజెపి (ఈటల రాజేందర్) గెలుస్తారని జోస్యం చెప్పగా ఒక్కటి మాత్రం టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తారని చెప్పింది. ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితం కాబోతోందని సర్వేలు స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు:
|
ఓటింగ్ శాతం |
||||
|
|
టిఆర్ఎస్ |
బిజెపి |
కాంగ్రెస్ |
ఇతరులు/నోటా |
|
నాగన్న |
44.3-48.9 |
42.9-45.5 |
2.25 |
55.5-6.5 |
|
ఆత్మసాక్షి |
43.1 |
50.5 |
5-7 |
0.7 |
|
పబ్లిక్ పల్స్ |
44.3 |
50.9 |
2.7 |
- |
|
పోలిటికల్ ల్యాబ్ |
42 |
51 |
2-3 |
<1 |
|
హెచ్ఎంఆర్ రీసర్చ్ |
44.98 |
51.16 |
2.81 |
1.05 |