సంబంధిత వార్తలు
.jpeg)
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. తెలంగాణాలో ఆరు, ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 9న నోటిఫికేషన్ జారీ చేసి, 29న పోలింగ్ నిర్వహించి అదేరోజున ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
తెలంగాణలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, , గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యసాగర్, ఫరీజుద్దీన్, వెంకటేశ్వర్లు, ఆకుల లలితల పదవీ కాలం జూన్ 3వ తేదీతో ముగిసింది. కానీ కరోనా కారణంగా వెంటనే ఎన్నికలు నిర్వించలేక పోయింది. ఇప్పుడు కరోనా తీవ్రత పూర్తిగా తగ్గినందున ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.