సంబంధిత వార్తలు
1.jpeg)
హుజురాబాద్ లో పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. సాయంత్రం ఐదు గంటలకు 76.26% పోలింగ్ నమోదయింది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది కనుక మరో పది శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉంది.
ఈ ఉప ఎన్నిక తెరాస, బిజెపి అభ్యర్థి రాజేందర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడారు. గత నాలుగైదు నెలలుగా తెరాస నేతలు, ఈటెల రాజేందర్ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ నియోజకవర్గంలో ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతీ ఓటరును కలిశారు. బహుశా అందుకే ఈరోజు ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా జనం తరలి వచ్చారని భావించవచ్చు. నవంబర్ 2న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.