హుజురాబాద్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు 45.63% పోలింగ్ నమోదు

హుజురాబాద్ లో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ మొదలైంది. నియోజకవర్గంలో అన్ని కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45.63% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్ సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగుతుంది.

ఇప్పటివరకు జరిగిన పోలింగ్ తీరును బట్టి పోలింగ్ ముగిసే సమయానికి కనీసం 70-75% పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని భావించవచ్చు.