మలక్‌పేటలో శనివారం జాబ్‌మేళా

హైదరాబాద్ సిటీ పోలీసులు, ఫిక్కీ, సీపీసీటీ, టిమీ పౌండేషన్ సంయుక్తంగా రేపు (శనివారం) మలక్‌పేటలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు సిటీ పోలీసులు తమ అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇందులో 2 7 ప్రైవేట్ కంపెనీలలో నాలుగు వేలకు పైగా ఖాళీలను అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేసుకోనున్నాయి. ఈ జాబ్‌మేళాలో టీఎమ్ఐ గ్రూప్, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్, మహేంద్ర గ్రూప్, అపోలో ఫార్మసీ లిమిటెడ్, నవతా రోడ్ ట్రాన్స్ పోర్ట్, ఎరీనా యానిమేషన్ వంటి సంస్థలు పాల్గొనబోతున్నాయి. ఆసక్తి, అర్హత  గల అభ్యర్థులు www.bit.ly/jcepass వెబ్‌సైట్‌లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 

జాబ్‌మేళా వేదిక: సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్, పాలస్,16-2-741, అస్మాన్ గర్ రోడ్డు, అస్మాన్ గర్, బ్యాంకు కాలనీ, మలక్ పేట్, హైదరాబాద్

సమయం: ఉదయం 9 :30గంటల నుండి ప్రారంభం.