వాసాలమర్రి లబ్దిదారులకి వాహనాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో దళిత బంధు పధకం కింద ఎంపికైన లబ్దిదారులలో పది మందికి మంత్రి జగదీష్ రెడ్డి బుదవారం ట్రాక్టర్లు, గూడ్స్ వెహికల్స్, ప్యాసింజర్ ఆటో రిక్షాలను అందజేశారు. వాసాలమర్రి గ్రామంలో మొత్తం 76 దళిత కుటుంబాలకు ఈ పధకం ద్వారా పదేసి లక్షలు చొప్పున సొమ్మును వారి బ్యాంక్  ఖాతాలలో జమా చేసింది. వారిలో పది మంది ట్రాక్టర్, గూడ్స్ వెహికల్, ఆటో రిక్షా వంటి వాహనాలను కొనుక్కొన్నారు. వాటి తాళాలను మంత్రి జగదీష్ రెడ్డి నిన్న వారికి అందజేశారు. లబ్దిదారులు మంత్రికి, సిఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.