
ప్రవాస భారతీయురాలు అనిత ఆనంద్ కెనడా రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్రో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అనితను రక్షణ మంత్రిగా నియమించారు. గతంలో రక్షణ మంత్రిగా ప్రవాస భారతీయుడు హర్షిత్ సజ్జన్ వ్యవహరించేవారు. కానీ ఆయన సైన్యంలో లైంగిక దుష్ప్రవర్తనను నిలువరించడంలో విఫలమయ్యారని విమర్శలు రావడంతో ఆయనను మంత్రివర్గం నుండి తప్పించారు.
అనిత ఆనంద్ కెనడాలో ప్రముఖ న్యాయవాదిగా పేరొందారు. గత నెలలో జరిగిన ముందస్తు ఎన్నికలలో ఓక్ విల్లే నుంచి 46 శాతం ఓట్లతో విజయం సాధించారు. గత మంత్రివర్గంలో ఆమె కరోనా వ్యాక్సినేషన్ శాఖను మంత్రి హోదాలో నిర్వహించారు. ఆమెకు కార్పోరేట్ గవర్నెన్స్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది.