నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు మిలాద్‌– ఉన్‌– నబీ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సిటీ పోలీస్ కమీషనర్‌ అంజనీకుమార్ తెలిపారు. ఈరోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పురానీ హవేలీ, ఎంఎం సెంటర్, నయాపూల్, ఛార్మినార్ వద్ద నారాయణ స్కూల్, మక్కా మసీదు, లాల్  దర్వాజా మోడ్, షంషీర్ గంజ్, ఇంజన్ బౌలీ, చార్ కమాన్, మచిలీ కమాన్, పిస్తాహౌస్, నయాపూల్, గుల్జార్ హౌస్, సాలార్ జంగ్ మ్యూజియం, దారుల్ షిఫా, తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని అంజనీ కుమార్‌ తెలిపారు. కనుక ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. 

నేడు మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా సాలార్ జంగ్ మ్యూజియంకు శలవు ఉంటుందని మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు.