సంబంధిత వార్తలు

హైదరాబాద్ నగరానికి మాదకద్రవ్యాల బెడద వదలడం లేదు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుదవారం అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్ వద్ద వాహనాలను తనికీలు చేస్తుండగా గంజాయి తరలిస్తున్న ఓ వాహనంలో 1.2 కేజీల గంజాయి పట్టుబడింది. దానిని తరలిస్తున్న ఒక మహిళతో సహా ఏడుగురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వాహనాన్ని, గంజాయిని స్వాధీనం చేసుకొని ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకు వెళుతున్నారు? అని తెలుసుకొనేందుకు పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.