
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి సిఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు, అధికార, ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై, సిఎం కేసీఆర్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తరువాత మొట్ట మొదటగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, తరువాత జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ హిమా కొహ్లీ హైకోర్టు ప్రధానన్యాయమూర్తులుగా పనిచేశారు. ఇప్పుడు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఆ బాధ్యతలు చేపడుతున్నారు.