తెల్ల రేషన్ కార్డులు పెరుగుతున్నాయంటే అర్ధం ఏమిటి?

బిజెపి మహిళా నేత విజయశాంతి టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. సిఎం కేసీఆర్‌ తెలంగాణ ధనిక రాష్ట్రమని చెపుతుంటారు. మరోపక్క రాష్ట్రంలో భారీగా తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశామని మంత్రిగారు చెపుతుంటారు. తెలంగాణ ధనిక రాష్ట్రమైతే తెల్ల రేషన్ కార్డు వినియోగదారులు ఎందుకు పెరుగుతున్నారు? దానికి అర్ధం ఏమిటి? రాష్ట్రంలో పేద ప్రజల సంఖ్య పెరుగుతోందనే కదా? సిఎం కేసీఆర్‌ శాసనసభలో చెప్పే లెక్కలకి సివిల్ సప్లైస్ జారీ చేస్తున్న రేషన్ కార్డులకి ఎక్కడా పొంతన లేదని అర్ధమవుతోంది, ” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె మాటల్లోనే...\