హుజూరాబాద్‌ బిజెపి స్టార్ క్యాంపెయినర్స్ వీరే

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు బిజెపి 20 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను ప్రకటించింది. దానిలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, సీనియర్ నేతలు మురళీధర్ రావు, కె.లక్ష్మణ్, డికె.అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్, రమేశ్ రాథోడ్, కూన శ్రీశైలం గౌడ్, రవీందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, యెండల లక్ష్మినారాయణ, చంద్ర సురేశ్ రెడ్డి ఉన్నారు. 

అయితే కరోనా కారణంగా ఈసారి కూడా భారీ సభలు, ర్యాలీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించడం లేదు. స్టార్ క్యాంపెయినర్స్ నిర్వహించే సభలకు గరిష్టంగా 1,000 మంది, మిగిలినవారి సభలు ర్యాలీలకు 500 మంది మించరాదని ఆదేశించింది. కనుక ఈనెల 30న పోలింగ్‌కు రెండు రోజుల ముందు హుజూరాబాద్‌లో సిఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించగలరా లేదో అనుమానమే.