హుజూరాబాద్‌లో నామినేషన్ వేసిన ఈటల జమున

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ పేరును బిజెపి ఖరారు చేసి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మొన్న సోమవారం ఆయన అర్ధాంగి ఈటల జమున హుజూరాబాద్‌లో నామినేషన్ వేయడం విశేషం. ఒకవేళ ఏ కారణం చేతైనా ఈటల రాజేందర్‌ నామినేషన్ తిరస్కరించబడినా, అసైన్డ్ భూముల కబ్జా కేసులో అరెస్ట్ అయినా ఆమె పోటీ చేస్తారు. కనుక ఆమె నామినేషన్ను ముందు జాగ్రత్త చర్యగానే చూడవచ్చు. ఈటల రాజేందర్‌ చివరి రోజైన శుక్రవారం నామినేషన్ వేస్తారు. ఆదేరోజున కాంగ్రెస్‌ అభ్యర్ధి బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు కూడా నామినేషన్ వేస్తారు. 

ఈటల జమున నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలు: 

పేరు: ఈటల జమునా  

వయసు: 56 సంవత్సరాలు 

చదువు: ఇంటర్మీడియెట్ 

వృత్తి: పౌల్ట్రీ వ్యాపారం  

వార్షికాదాయం: రూ.1.33 కోట్లు       

చరాస్తుల విలువ: రూ.28.68 కోట్లు

చరాస్తులలో బంగారు ఆభరణాలు: సుమారు రూ. 50 లక్షల విలువ గల 1,500 గాముల ఆభరణాలు.  

ఇన్నోవా కారు విలువ: 16.44 లక్షలు, హోండా కారు: 20.80 లక్షలు, ఇన్నోవా క్రిస్టా కారు: రూ.12.21 లక్షలు.