ఉపఎన్నికకు టిఆర్ఎస్‌ స్టార్ కాంపెయినర్స్ వీరే

హుజూరాబాద్‌ ఉపఎన్నిక తమ పార్టీకి చాలా చిన్నదని చెపుతూనే టిఆర్ఎస్‌ దాని కోసం సార్వత్రిక ఎన్నికలకు చేస్తున్నంత ఏర్పాట్లు చేసుకొంటుండటం విశేషం. ఈ ఉపఎన్నికకు సిఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, గంగుల, కొప్పులతో సహా మొత్తం 20 మంది స్టార్ కాంపెయినర్స్‌తో ఓ జాబితాను తయారుచేసి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. 

ఈ జాబితాలో ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు అన్నపనేని నరేంద్ర, సండ్ర వెంకట వీరయ్య, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, దాసరి మనోహర్ రెడ్డి, వి.సతీష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జెడ్‌పి ఛైర్మన్ కనుమల్ల విజయ తదితరులున్నారు.