
హైదరాబాద్, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను బాటసింగారంకు తరలించడంపై హైకోర్టు అక్టోబర్ 4వరకు స్టే విధించింది. బాటసింగారం వద్ద ఫ్రూట్ మార్కెట్‌కు సరిపడినంత స్థలం లేదని, అక్కడ సరైన సౌకర్యాలు కూడా లేవని ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులు, కమీషన్ ఏజంట్లు మార్కెట్ తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో వారు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దానిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు బాటసింగారం మార్కెట్లో సదుపాయాలపై నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది. ఆ నివేదికను చూసిన తరువాత తదుపరి విచారణలో ఈ సమస్యపై ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత తీర్పు వెలువరిస్తామని హైకోర్టు చెప్పింది.