
స్వాతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నేడు. మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాడారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రజలలో చైతన్యం రగిలించి పోరాడారు. ఆయన స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సాధించేవరకు సిఎం కేసీఆర్ నేతృత్వంలో మలిదశ ఉద్యమాలు సాగాయి,” అని అన్నారు.