జైలుకి వెళ్ళివచ్చిన వారితో కాదు..రాహుల్ వస్తే నేను రెడీ: కేటీఆర్‌

హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల కేసులు పెరుగుతుండటంతో వాటికి వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ‘వైట్ ఛాలెంజ్’ పేరిట మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్కులో అమరవీరుల స్తూపం వద్ద వారి కోసం ఎదురు చూస్తుంటానని, ఇద్దరూ వస్తే ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకొందామని రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు. దానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కానీ మంత్రి కేటీఆర్‌ భిన్నంగా స్పందించారు. 

“నేను ఎలాంటి పరీక్షలకైనా సిద్దంగా ఉన్నాను. కానీ చర్లపల్లి జైలుకి వెళ్ళివచ్చిన రేవంత్‌ రెడ్డి స్థాయి నాది కాదు. కనుక రాహుల్ గాంధీ ముందుకు వస్తే నేను ఢిల్లీ వెళ్ళి ఎయిమ్స్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోవడానికి సిద్దంగా ఉన్నాను. ఒకవేళ నేను పరీక్షలు చేయించుకొని క్లీన్ చిట్ పొందితే రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెప్పి తన పదవులు  వదులుకొంటారా?” అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.