ప్రగతి భవన్‌కు భట్టి విక్రమార్క

సిఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పధకానీ రాష్ట్రంలో మరో నాలుగు మండలాలలో అమలుచేయాలని నిర్ణయించినందున, ఇవాళ్ళ సాయంత్రం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన దళిత బంధు సన్నాహక సమావేశం జరుగుతోంది. ఈసారి ఖమ్మం జిల్లా మధిర శాసనసభ నియోజకవర్గం పరిధిలోని చింతకాని మండలంలో దళిత బంధుని అమలుచేయబోతున్నందున, ప్రభుత్వం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. 

ఓ వైపు నిత్యం ఈ పధకం అమలుపై విమర్శలు గుప్పిస్తూ నేడు ఈ సమావేశానికి హాజరయ్యి దానిపై జరిగే చర్చలో పాల్గొనడం భట్టి విక్రమార్కకు చాలా ఇబ్బందికరమే కానీ కాంగ్రెస్‌ నేతల సూచన మేరకు హాజరవుతున్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా దృవీకరించారు. సమావేశంలో పాల్గొని దీనిపై తమ పార్టీ అభిప్రాయాలూ, సూచనలు, సలహాలు, డిమాండ్స్ అన్ని సిఎం కేసీఆర్‌కు చెపుతానని భట్టి విక్రమార్క అన్నారు.